
ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు తమిళనాడులో మళ్లీ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య శాఖ 13 ఏళ్ల క్రితం రాష్ట్రంలో గర్భనిరోధక మాత్రలు అమ్మడాన్ని బ్యాన్ చేసింది. అయితే కొంతమంది సామాజిక కార్యకర్తలు మాత్రం 2017 నుంచి అత్యవసర గర్భనిరోధక మాత్రలను మళ్లీ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ స్పందించింది. త్వరలోనే ఆ మాత్రలను తమిళనాడు అంతటా అమ్మేలా ఫార్మసీ షాపులను ఆదేశించే అవకాశమున్నట్లు సమాచారం. గర్భం రాకుండా ఉండటానికి ఈ మాత్రలను 72 గంటలలోపు ఉపయోగిస్తారు.
మాత్రలు అమ్మకపోవడంపై గల కారణాలను వివరిస్తూ తమిళనాడు కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మాట్లాడారు. ‘గర్భనిరోధక మాత్రలు రాష్ట్రంలో నిషేధించబడలేదు. కేవలం ఆస్పత్రులలోని ఫార్మసీలలో మాత్రమే అమ్ముతున్నారు. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఫార్మసీలు మాత్రలు ఇవ్వగలవు. చాలా ఫార్మసీలు ప్రిస్క్రిప్షన్ లేకున్నా కూడా ఈ మాత్రలను ఇస్తున్నారు. అందుకే కేవలం ఆస్పత్రులలోని ఫార్మసీలలో మాత్రమే అమ్ముతున్నారు. ఈ మాత్రలు అధికంగా తీసుకోవడం వల్ల మహిళలకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అధిక రక్తస్రావం కూడా జరిగి మరణాలకు కారణమవుతుంది. అందుకే ఎమర్జెన్సీ కాన్ట్రాసెప్టివ్ పిల్స్‌ను అందుబాటులో ఉంచడం లేదు’ అని ఆయన తెలిపారు.
For More News..