
హైదరాబాద్ సిటీ, వెలుగు: పెండింగ్ లో ఉన్న జులై నెల వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, పారామెడికల్ ఉద్యోగులు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హరిహర కళాభవన్ లో డీఎంహెచ్ వో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. నగర అధ్యక్షుడు కుమారస్వామి, కిరణ్మయి పాల్గొన్నారు.