కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పెన్ డౌన్.. రైగ్యులరైజ్ చేయాలని డిమాండ్

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పెన్ డౌన్.. రైగ్యులరైజ్ చేయాలని డిమాండ్

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని.. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు పెన్ డౌన్ చేసి ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న  14 వందల మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారని దాని ప్రకారమే అందరిని రెగ్యులరైజ్ చేయాలని తెలిపారు. 

తాము గత 30 సంవత్సరాలుగా టీచింగ్ చేస్తూ.. ఎంతో మంది నిరుపేదలకు విద్యను అందిస్తున్నామని అయినా... తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా విధులను బహిష్కరించి పెన్ డౌన్ చేసినా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. 

తక్షణమే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. లేకుంటే విశ్వవిద్యాలయలలో విద్యను ఆపేసి.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.