బైక్ ఢీకొని కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

బైక్ ఢీకొని కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

తొర్రూరు, వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తొర్రూరుకు చెందిన సర్వి రమేశ్(42) సర్వ శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) విభాగంలో కాంట్రాక్ట్ సీఆర్పీగా చేస్తున్నాడు. శనివారం తొర్రూరు బస్టాండ్ వైపు నుంచి బైక్ పై అతను ఇంటికి వెళ్తుండగా..  అన్నారం రోడ్డు సమీపంలో జఫర్ ఘడ్ మండలానికి చెందిన జువారి బన్నీ అనే వ్యక్తి బైక్ పై ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు.  

దీంతో రమేశ్​తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స కోసం వరంగల్‎లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‎గా ఉండడంతో హైదరాబాద్‎లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం  ఉదయం చనిపోయాడు. రమేశ్‎కు భార్య సుమలత, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. మృతుడి అన్న సర్వి వెంకన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.