ఫేక్ సర్టిఫికేట్లతో కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాలు

ఫేక్ సర్టిఫికేట్లతో కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాలు
  • ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్

హైదరాబాద్, వెలుగు : కాంట్రాక్టు లెక్చరర్లు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలితే క్రిమినల్ కేసులు పెడతామని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ తెలిపారు. రెగ్యులరైజేషన్​ కోసం జనరల్ కోర్సుల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల వివరాలను సర్కారుకు పంపించినట్లు చెప్పారు. మంగళవారం ఇంటర్ బోర్డు  కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 584 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లోని పీజీ సర్టిఫికేట్లు పెట్టారని ఉమర్ జలీల్ వెల్లడించారు. 

ఈ ఏడాది ఇప్పటికే 70,259 మంది స్టూడెంట్లు సర్కారు కాలేజీల్లో చేరారని.. సెప్టెంబర్15 వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సర్కారు కాలేజీ స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్ అందని మాట వాస్తవమేనని, రెండు రోజుల్లో సెకండియర్ పుస్తకాలు కాలేజీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పేపర్ కొరతతో సమస్య ఏర్పడినట్లు తెలుగు అకాడమీ అధికారులు చెప్తున్నారని వివరించారు.