4 నెలలుగా జీతాలు ఇస్తలేరు..సెక్రటేరియెట్ ముందు కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల ధర్నా

4 నెలలుగా జీతాలు ఇస్తలేరు..సెక్రటేరియెట్ ముందు కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల ధర్నా

హైదరాబాద్, వెలుగు : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ ముందు కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. జీతాలు రాకపోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు వెళ్లదీసుకోలేక పోతున్నట్లు పేర్కొన్నారు. పారిశుధ్య పనులు ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తారని..

వాళ్లకు ప్రభుత్వం డబ్బులు ఇస్తే వారి నుంచి తమకు జీతాలు వస్తాయని తెలిపారు. అయితే సదరు కంపెనీకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో లేదోనని తమకైతే జీతాలు ఇవ్వడం లేదన్నారు. ప్రతినెలా తమకు వచ్చే జీతం రూ.11 వేలుమాత్రమేనన్నారు. వాటిని కూడా రిలీజ్​ చేయకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకోవాలన్నారు.