బయటపడుతున్న ‘గ్లోబరినా’ మోసాలు

బయటపడుతున్న ‘గ్లోబరినా’ మోసాలు

ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. విద్యార్థుల భవిష్యత్తుతో ఈ సంస్థ, అధికారులు ఆటలాడుతుందని పేరెంట్స్, రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.  అవినీతి ఆరోపణలు ఈ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసి.. అత్యంత కీలకమైన పనిని, బాధ్యతను ఎలా అప్పగించిందంటూ ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్.

2017 లోనే కాకినాడ జేఎన్టీయూలో ఇ-లెర్నింగ్ ఇ-కంటెంట్ టెండర్లలో మోసాలకు పాల్పడిందనే ఆరోపణలు గ్లోబరినా సంస్థపై ఉన్నాయి. కాకినాడ జేఎన్టీయూలో రూ.36 కోట్ల ఒప్పందం ద్వారా ఈ సంస్థ టెండర్ దక్కించుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఐతే… టెండర్ గోల్ మాల్ లో  గ్లోబరినా సంస్థ….రూ. 26 కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. గ్లోబరినా మోసాలపై గతంలోనే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు.

 గ్లోబరిన్ సాప్ట్ వేర్ కంపెనీయే కారణం: సీపీఐ నారాయణ

ఇంటర్ రిజల్ట్స్ తప్పిదాలపై గ్లోబరినా సాప్ట్ వేర్ కంపెనీయే కారణమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  గతంలో కాకినాడ జేఎన్టీయూలో గ్లోబరినా  మోసాలు బయటపడ్డాయని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు నారాయణ.