వడ్ల కొనుగోలుకు కంట్రోల్ రూమ్ ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్

 వడ్ల కొనుగోలుకు  కంట్రోల్ రూమ్ ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి  సివిల్ సప్లయ్​ ఆఫీస్​లో  వడ్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​ను బుధవారం అడిషనల్ కలెక్టర్​ వి.విక్టర్​ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో ఇబ్బందులు  ఏర్పడితే  08468-220051కు సంప్రదించాలన్నారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందన్నారు. సివిల్ సప్లయ్​ అధికారి వెంకటేశ్వర్​రావు, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.