టీఆర్ఎస్ సమావేశంలో డబ్బుల పంపిణీపై గొడవ

V6 Velugu Posted on Sep 15, 2021

హైదరాబాద్ AS రావు నగర్ డివిజన్ టీఆర్ ఎస్ సమావేశం రసాభాసగా మారింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశంలో ఉండగానే టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డబ్బుల పంపిణీలో పలు అవకతవకలు జరిగాయని పార్టీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పార్టీలో కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని సింగారం శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఒకేసారి కార్యకర్తలందరూ గొడవకు దిగారు. దీంతో వేదికపై ఉన్న సుభాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గందరగోళానికి లోనయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సమావేశ ప్రదేశానికి వచ్చి కార్యకర్తలను శాంతింపజేశారు. ఆ తర్వాత సమావేశం సాఫీగా జరిగింది.

Tagged money, Controversy, Distribution, TRS meeting, AS Rao nagar

Latest Videos

Subscribe Now

More News