ఆనంద్ మహీంద్రా, కేటీఆర్ మధ్య ఫన్నీ సంభాషణ

 ఆనంద్ మహీంద్రా, కేటీఆర్ మధ్య ఫన్నీ సంభాషణ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా... తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన పోస్ట్ చేసింది ఎవరి గురించో కాదు మంత్రి కేటీఆర్ గురించి. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఓ ప్రాబ్లమ్ ఉందంటూ.. కేటీఆర్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇటీవల జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ సందర్శించిన మంత్రి కేటీఆర్... మహీంద్రా జీ మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే.. మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ అంటూ మహీంద్రా కంపెనీకి చెందిన ట్రాక్టర్ ముందు నిల్చొని ఫోజులిస్తున్న ఫొటోలను ట్విట్టర్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. 

కేటీఆర్ చేసిన ట్వీట్ కు రిప్లైగా ఆనంద్ మహీంద్రా సరదాగా సమాధానమిచ్చారు. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న  టాలీవుడ్ మిమ్మల్ని తమవైపు లాగేసుకుంటుందంటూ ఆయన చమత్కరించారు. దీనికి సమాధానంగా సర్, మీకు ఇంకెవరూ దొరకలేదా అంటూ, ఓ స్మైలీ ఎమోజీని షేర్ చేస్తూ కేటీఆర్ ఫన్నీ వే లో మళ్లీ రిప్లై ఇవ్వడం కొసమెరుపు.