పెళ్లి కోసమే మతం మారడం వల్ల ప్రయోజనం లేదు

పెళ్లి కోసమే మతం మారడం వల్ల ప్రయోజనం లేదు

పెళ్లి కోసమే మత మార్పిడి చేసుకోవడం కుదరదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కావాలంటూ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఉత్తర ప్రదేశ్ లోని ఓ ముస్లీం యువతి ఓ హిందు వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఆమె హిందూ మతంలోకి మారింది. ఆ తర్వా తమకు పోలీసుల రక్షణ కావాలని కోర్టులో పిటిషన్ వేసింది ఆ జంట. ఈ పిటిషన్ ను విచారించిన అలహాబాద్ కోర్టు.. ‘పెండ్లి కోసమే మతం మార్పిడి చేసుకోవడం కుదరదు. వివాహం కోసం మతం మారడం ఆమోదయోగ్యం కాదు. మత విలువలు, మత సంప్రదాయాల గురించి తెలియకుండా,మతంపై నమ్మకం లేకుండా మత మార్పిడి చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు‘ అని తెలిపింది. ఆ జంట వేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.