అంగన్​వాడీ కేంద్రంలో పేలిన కుక్కర్

అంగన్​వాడీ కేంద్రంలో పేలిన కుక్కర్
  •     ఇద్దరు చిన్నారులకు గాయాలు
  •     సూర్యాపేట జిల్లా శాంతినగర్ లో ఘటన 

కోదాడ,వెలుగు: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లో ఉన్న అంగన్​వాడీ కేంద్రంలో సోమవారం వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్ పేలి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..కేంద్రంలో సిబ్బంది పప్పు వండుతుండగా ఒత్తిడి ఎక్కువై కుక్కర్ పేలింది.ఈ ఘటనలో మూడేండ్ల చిన్నారులు నీలం అభినవ్, కరిశ తన్సీ గాయపడ్డారు.

వీరిని కోదాడ హాస్పిటల్​కు తరలించారు. తహసీల్దార్ రవి కుమార్ దవాఖానకు వెళ్లి పిల్లలను  పరామర్శించారు. ఫస్ట్​ ఎయిడ్​ తర్వాత హైదరాబాద్ లోని ప్రైవేట్ ​హాస్పిటల్​కు తరలించారు. కుక్కర్ పేలిన సమయంలో అక్కడ సుమారు 15 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం.