COOLIE: రజనీకాంత్ కూలీ అప్డేట్.. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

COOLIE: రజనీకాంత్ కూలీ అప్డేట్.. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చేనెల ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి సంబంధించిన న్యూస్ బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

కూలీ మూవీని దాదాపు రూ.375 కోట్లతో నిర్మించారు తమిళ మేకర్స్. ఇందులోభాగంగా పాన్ ఇండియా రాష్ట్రాలలో కూలీ భారీ బిజినెస్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తెలుగు థియేట్రికల్ హక్కులను ఆసియన్ సురేష్ రూ.45 కోట్లకు కొనుగోలు చేసారు. ఈ సినిమా తెలుగులో మంచి ఓపెనింగ్ సాధించాలంటే ఇంకొంచెం బజ్ కావాల్సి ఉంది. డైరెక్ట్ రజినీ కాంత్ ప్రమోషన్స్లో పాల్గొంటే తప్ప అది జరగదని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

ఈ క్రమంలోనే కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆగస్టు 7 డేట్ ను ఫిక్స్ చేసారని సినీ వర్గాల సమాచారం. తెలుగు పంపిణీదారులు కూలీ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారట.

ఈ ఈవెంట్కు సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్, అక్కినేని నాగార్జునతో పాటు ఉపేంద్ర సైతం హాజరుకానున్నారని తెలుస్తోంది. త్వరలో మేకర్స్ వెన్యూకి సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే, వచ్చే వారం కూలీ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ALSO READ : 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'కు లైన్ క్లియర్.. కేవలం 2 కట్స్‌తో సెన్సార్ వివాదం సుఖాంతం!