భారీగా పెరిగిన రాగి, అల్యూమినియ ధరలు.. తగ్గనున్న కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీల లాభాలు

భారీగా పెరిగిన రాగి, అల్యూమినియ ధరలు.. తగ్గనున్న కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీల లాభాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ2)లో రాగి  ధరలు ఏడాది లెక్కన 57శాతం, అల్యూమినియం 35శాతం, పాలిమర్ ధరలు 34శాతం వరకు పెరిగాయి. ఈ ముడిసరుకుల ధరలు పెరగడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటివి తయారు చేసే  కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ కంపెనీల లాభాలు తగ్గిపోతాయని  రేటింగ్ ఏజెన్సీ  నోమురా ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.   కంపెనీలు తమ ప్రొడక్ట్‌‌‌‌ల ధరలను పెం చాల్సి వస్తోందని, ఫలితంగా ఆదాయం దాదాపు 15శాతం వరకు పెరిగే వీలుందని  స్పష్టం చేసింది. 

అయితే  సేల్స్ తగ్గిపోయే ప్రమాదముందని, మార్జిన్స్  పడిపోతాయని తెలిపింది. నోమురా రిపోర్ట్ ప్రకారం,  ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ బాగున్నా, మాస్ సె గ్మెంట్ బలహీనంగా ఉంది. అక్టోబర్ 1 నుంచి ఏసీల ధరలు 5శాతం నుంచి 7శాతం పెరిగినప్పటికీ, వోల్టాస్ వంటి సంస్థల  లాభాలు తగ్గిపోవచ్చు.  

ఎలక్ట్రానిక్స్ త యారీలో వృద్ధి కనిపిస్తోంది.   డిక్సన్ టెక్నాలజీస్ క్యూ2 లో  95 లక్షల మొబైల్స్ షిప్‌‌‌‌మెంట్ చేస్తుందని, అవలాన్ టెక్నాలజీస్ ఆదాయం 35శాతం పెరగొచ్చు . నైకా ఆదాయం 29శాతం పెరుగుతుందని పేర్కొన్న నొమురా.. ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిక్సన్, అవలాన్‌‌‌‌లకు, వినియోగ రంగంలో నైకా, వేక్‌‌‌‌ఫిట్‌‌‌‌లకు ప్రాధాన్యతనిచ్చింది.