ప్రధాని భద్రత అంశంలో దిద్దుబాటు చర్యలు అవసరం

ప్రధాని భద్రత అంశంలో దిద్దుబాటు చర్యలు అవసరం

ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు వెల్లడించింది. చాలా మంది సిబ్బంది ఉన్నా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంజాబ్ లో మోడీ పర్యటనలో భద్రతా లోపాలపై ఎంక్వైరీ రిపోర్ట్ ను కమిటీ సుప్రీం కోర్టుకు అందించింది. ఆ రిపోర్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రధాని భద్రత అంశంలో దిద్దుబాటు చర్యలు అవసరమని సీజేఐ సూచించారు. కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు.