లాక్​డౌన్​ బ్రేక్​ చేసినోళ్ల ఫొటోలు ఫేస్​బుక్​లో

లాక్​డౌన్​ బ్రేక్​ చేసినోళ్ల ఫొటోలు ఫేస్​బుక్​లో

ముంబై: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ విధించాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ అవగాహన కల్పిస్తున్నాయి. అయినా చాలామంది జనాలు బయట తిరుగుతున్నారు. పోలీసులు ప్రస్నిస్తే సిల్లీ కారణాలు చెప్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు డిఫరెంట్ ఐడియా ఫాలో అవుతున్నారు. లాక్ డౌన్ రూల్స్ పాటించకుండా బయట తిరుగుతున్న వారి ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్నారు.

సిల్లీ రీజన్స్ చెప్తున్నారు
‘‘మార్నింగ్, ఈవినింగ్ సమయాల్లో బయటికి వచ్చిన వాళ్లను ప్రశ్నిస్తే వాకింగ్ కి వచ్చామని చెప్తున్నారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓవర్‌‌ గా వ్యవహరిస్తున్నారు. వాళ్లు మాస్కులు పెట్టుకోవట్లేదు. డిస్టెన్స్ పాటించట్లేదు. అలాంటి వారిని శిక్షించేందుకు.. ‘నేను బాధ్యతారాహిత్యంగా బయటికి వచ్చాను, నేను సెల్ఫిష్’ అనే సందేశం ఉన్న కొన్ని సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశాం. నిందితులను అక్కడ నిలబెట్టి ఫొటో తీసి డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్నాం. ఇప్పటివరకు 40 మందికి పనిష్ మెంట్ విధించాం”అని కొల్హాపూర్ ఎస్పీ అభినవ్ దేశ్​ముఖ్ అన్నారు. ఈ డ్రైవ్ ద్వారా కొంతవరకైనా తమ తప్పును గ్రహిస్తారని, ఇంట్లో ఉండటం, డిస్టెన్స్ మెయింటేన్ చేయడం వంటివి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.