
ఇక్కడ కనిపిస్తున్న షిప్ కరోనా బారిన పడ్డది. షిప్ కరోనా బారిన పడడమేంది అనుకుంటున్నరా.. అవును నిజమే. దీని పేరు కార్డీలియా షిప్. నాలుగు రోజుల క్రితం న్యూ ఇయర్ గ్రాండ్గాసెలబ్రేట్ చేసుకునేందుకు ముంబై నుంచి 2 వేల మందిని గోవా తీస్కపోయింది ఈ భారీ క్రూయిజ్. గోవా తీరం చేరుకునే టైంలో అందరికీ కరోనా టెస్టు చేయగా.. 66 మందికి పాజిటివ్ వచ్చింది. ప్యాసింజర్స్‌ను గోవా మెడికల్ హబ్‌లో క్వారంటైన్ కావాలని క్రూయిజ్ స్టాఫ్ కోరగా.. వాళ్లు ఒప్పుకోలే. దీంతో చేసేదేమీ లేక షిప్‌ను తిరిగి ముంబై తీసుకెళ్లారు. ముంబై పోర్టులో.. లక్షణాలు లేనివారిని షిప్‌లోనే ఐసోలేషన్చేయగా, లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా అంబులెన్సులను ఏర్పాటు చేసి హాస్పిటళ్లకు తరలించారు.