మక్క నిల్వలు..  లారీల బారులు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ షెడ్ల దగ్గర పరిస్థితి

మక్క నిల్వలు..  లారీల బారులు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ షెడ్ల దగ్గర పరిస్థితి

ఖమ్మం వ్యవసాయ మోడల్ మార్కెట్ షెడ్లలో మక్క నిల్వలకు అవకాశం కల్పించడంతో మార్క్​ఫెడ్  అధికారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన మక్కలను ఖమ్మంకు తరలిస్తున్నారు. గోదాంలో బస్తాలు దింపేందుకు హమాలీలు సరిపడా లేకపోవడంతో మార్కెట్​కు వచ్చిన లారీలు, ట్రాక్టర్ల నుంచి అన్​లోడ్​ చేయడానికి సీరియల్  ప్రకారం రెండు నుంచి మూడు రోజులు పడుతోంది.

లోడ్ తో ఓసారి కాంటా, ఖాళీ బండ్లు కాంటా వేయించడం సమస్యగా మారింది.   వాహనాదారులు వెయిటింగ్ చార్జీ కింద రైతుల నుంచి రోజుకు రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. మార్కెట్​కు వచ్చే మిర్చి, మక్క వాహనాలతో ఖమ్మం సీపీ ఆఫీస్ ఎదుట నుంచి మార్కెట్ వరకు తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో లారీల ఓనర్లు మక్క లోడ్​కు కిరాయి అంటే భయపడి వెహికల్స్ పెట్టడం లేదు.  -