మిల్లర్ల ఆగడాలపై బీజేపీ ధర్నా 

మిల్లర్ల ఆగడాలపై బీజేపీ ధర్నా 

గంగాధర/కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, మిల్లర్లు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌ మండలం ముగ్ధంపూర్‌‌‌‌‌‌‌‌లో రాజీవ్‌‌‌‌ రహదారిపై, గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌లో తరుగు, కటింగ్‌‌‌‌ పేరిట నిర్వాహకులు, మిల్లర్ల దోపిడీకి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధ్యత వహించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. రాజీవ్ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు.