- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నేలకొండపల్లి, వెలుగు: పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వల గూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు.
రైతుల సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుందని చెప్పారు. 25లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మే నెలాఖరికి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
