తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ .. సివిల్స్ ఫ్రీ కోచింగ్..ఆన్లైన్ దరఖాస్తు

తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ .. సివిల్స్ ఫ్రీ కోచింగ్..ఆన్లైన్ దరఖాస్తు

వికారాబాద్, వెలుగు: తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ద్వారా 2027 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి ఎస్. రాజేశ్వరి తెలిపారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, బౌద్ధ, పార్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

 డిజిటల్ క్లాస్​రూమ్​లో నిపుణులైన బోధనా సిబ్బంది కోచింగ్​అందిస్తామని, లైబ్రరీ, వైఫై సౌకర్యాలు ఉంటాయన్నారు.  ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్​కు అర్హులని, ఈ నెల 7 నుంచి మే 31 వరకు https://cet.cgg.gov.in/tmreis వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-23236112 నంబర్​ను సంప్రదించవచ్చన్నారు.