కరోనా పాజిటివ్ నమోదైన ఏరియాలో కలెక్టర్ పర్యటన
ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు
కాంటాక్ట్ అయిన 43 మందికి స్టాంపిం గ్
అందరినీ క్వారంటైన్ కు తరలించడానికి ఏర్పాట
అన్నపూర్ణ కాలనీలో కిలోమీటరు వరకు రెడ్‌జోన్‌గా ప్రకటన
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో పెద్ద పల్లి జిల్లాలో ఆఫీసర్లు అప్రమత్తం అయ్యారు. రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో పర్యటించిన ఆఫీసర్లు ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన 43 మందిని గుర్తించి వారికి స్టాం పింగ్ వేశారు. క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కాగా.. ఆఏరియాలో కిలోమీటర్వరకు రెడ్జోన్‌గా ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా నుంచి మర్కజ్‌కు ఆరుగురు
వెళ్లగా .. ఐదుగురు తిరిగి వచ్చారు . మరో వ్యక్తి మహా రాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఆగిపోయాడు.
ఆ ఐదుగురిని గుర్తించిన ఆఫీసర్లు ఈనెల 28వ తేదీన సుల్తానాబాద్మండలం గర్రెపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్ట
ల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులను సైతం క్వారంటైన్ చేశారు.
ముందుగా ఢిల్లీవెళ్ వలి చ్చిన వారి రక్త నమూనాలు సేకరించిన ఆఫీసర్లు పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. మొత్తంఐదుగురు వ్యక్తుల నమూనాలు పంపించగా ఒకరికిపాజిటివ్ వచ్చింది. ముగ్గురి రిపోర్టులు నెగిటివ్వచ్చాయి. మరొకరికి సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే హైదరాబాద్
గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆఫీసర్ల అధీనంలో అన్నపూర్ణ కాలనీ
క రోనా వైరస్‌ను అరికట్టడంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆధ్వర్యం లో అన్ని చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీవెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా ఆఫీసర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పాజిటివ్వచ్చిన వ్యక్తిది జిల్లాలోని
రామగుండం ఎన్పీసీటీ అన్నపూర్ణ కాలనీకావడంతో శుక్రవారం రాత్రి నుంచి ఆ కాలనీని ఆఫీసర్లు, పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి స్ప్రే చేయించారు. కాలనీ వారు ఇళ్ల నుంచి బయటికి రాకుండా, ఇతరులు అటువైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. శనివారం ఉదయమే కలెక్టర్ ఆ కాలనీని సందర్శించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీలకు చెందిన వైద్య బృందాలు కాలనీలోని 2,044 ఇళ్లలో ఉన్న
8,358 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాయి. వీరిలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేవని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. అయినా.. ఆఫీసర్లు ముందస్తుగా కాలనీకి కిలో మీటర్ మేర రెడ్జోన్‌గాప్రకటించారు. కలెక్టర్ తోపాటు పెద్ద పల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్‌కుమార్,
డీఎంహెచ్‌వో సుధాకర్, రామగుండం తహసీల్దార్ సుధాకర్, రామగుండం సీఐ కరుణాకర్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
కాంటాక్ట్ వ్యక్తు లను క్వారంటైన్‌కు తరలింపు రామగుండం ఎన్పీటీ సీ అన్నపూర్ణ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్రావడంతో అతను ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీశారు. 58 మందిని కలిసినట్లు తెలియడంతో వారిలో 43 మందికి శనివారం ఆఫీసర్లు స్టాం పింగ్ వేశారు. వీరితోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన మరో ఆరు గురికీ స్టాం పింగ్ వేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాంటాక్ట్ అయిన వారిని ధర్మారం మండలంలోని నందిమేడారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించనున్నారు .
