ఇండియాకు ఇమ్యూన్​ పవర్..భారీగా తగ్గుతున్నకేసులు

ఇండియాకు ఇమ్యూన్​ పవర్..భారీగా తగ్గుతున్నకేసులు
  • చాలా మందిలో యాంటీ బాడీలు ఉండడం వల్లేనంటున్న నిపుణులు
  • దేశంలో 27 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్టు సర్కార్​ సర్వేల్లో వెల్లడి
  • యువత ఎక్కువగా ఉండడం వల్లే మరణాలు తక్కువంటున్న డాక్టర్లు
  • కొత్త స్ట్రెయిన్లు వచ్చినా అదుపు చేయొచ్చని ఆశాభావం

న్యూఢిల్లీ: మూడు నెలల కిందటి మాట.. రోజూ దేశం మొత్తం లక్ష దాకా కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటికి ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అదే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అమెరికాను మించి రోజువారీ కేసులు వచ్చాయి. ఒక్కో ఆస్పత్రిలో బెడ్లూ చాలని పరిస్థితి. అవసరమైన వారికి వెంటిలేటర్లు దొరకని దుస్థితి. కానీ, ఇప్పుడు పరిస్థితి మన అదుపులోకి వచ్చింది. రోజువారీ కేసులు, మరణాలు భారీగా తగ్గిపోయాయి.

27 కోట్ల మందికి యాంటీబాడీలు

130 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో కోటీ 8 లక్షల మందికి కరోనా సోకింది. లక్షన్నర మందికిపైగా చనిపోయారు.నాలుగు రోజుల కిందట చేసిన సీరో సర్వేలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా యాంటీబాడీలున్నట్టు తేలింది. 28,600 మంది రక్త నమూనాలను పరిశీలించి ఈ విషయం తేల్చారు. ఆ లెక్కన దేశంలో 22 శాతం మందిలో కరోనా యాంటీబాడీలున్నట్టు అధికారులు లెక్కలేశారు. అంటే జనవరి నాటికే దేశ జనాభాలో 27 కోట్ల మందికి ఆల్రెడీ కరోనా సోకి ఉంటుందని అంచనా వేశారు. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే 56 శాతం మందికి యాంటీ బాడీలున్నట్టు నిర్ధారించారు. ముంబై, పుణె, హైదరాబాద్​ వంటి పెద్ద పెద్ద సిటీల్లోనూ పెద్ద సంఖ్యలో జనాలు కరోనా బారిన పడి ఉంటారని చెబుతున్నారు. అదే 44 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇప్పటిదాకా కేవలం 14 శాతం మందిలోనే యాంటీ బాడీలున్నట్టు తేలింది.

టెస్టులు పెరిగినా..

దేశంలో ప్రస్తుతం రోజూ సగటున పది లక్షల టెస్టులు చేస్తున్నారు. అయినా.. పాజిటివ్​ రేటు 2 శాతమే నమోదవుతోంది. అదే 3 నెలల కిందట దాదాపు 10 శాతం దాకా ఉండేది. అయితే, టెస్టులు పెరిగినా చాలా వరకు కేసులు బయట పడట్లేదు. కారణం, మన దేశంలో జనాలకు ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉండడమేనని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్​లో కరోనా కేసులు నమోదైనా పెద్ద సంఖ్యలో మాత్రం రావని పబ్లిక్​ హెల్త్​ ఫౌండేషన్​ ఆఫ్​ ఇండియా ఎపిడెమియాలజిస్ట్​ గిరిధర్​ బాబు అన్నారు.

మరణాలూ తక్కువే

అమెరికాలో 2.7 కోట్ల మందికిపైగా కరోనా బారిన పడితే.. 4.67 లక్షల మంది బలయ్యారు. బ్రెజిల్​లో 9.39 లక్షల కేసులకే.. 2.28 లక్షల మంది చనిపోయారు. 39 లక్షల కేసులకు.. బ్రిటన్​లో లక్షా పదివేల మంది కరోనాతో మరణించారు. ఆయా దేశాల్లో మరణాల రేటు 2 నుంచి 3 శాతం దాకా ఉంది. కానీ, మన దేశంలో 1.4 శాతంగా ఉంది. దీనికి కారణం దేశంలో యువత ఎక్కువగా ఉండడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇటు చనిపోయిన వారిలో కూడా ఎక్కువ మంది పెద్ద వయసు వాళ్లే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు నిపుణులు.. ఏదో తెలియని ఇమ్యూన్​ పవర్​ కరోనా తీవ్రత పెరగకుండా కాపాడుతోందని అంటున్నారు. దీనిపై మరింత రీసెర్చ్​ జరగాల్సిన అవసరం ఉందని, కొన్నేండ్లయినా దీనికి సమాధానాలు రాబట్టడం కష్టమేనని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ ఎడ్యుకేషన్​ అండ్​ రీసెర్చ్​ బయాలజిస్ట్​ అర్ణబ్​ ఘోష్‌‌ అన్నారు. యాంటీబాడీలు ఎక్కువగా ఉన్న సిటీల్లో కేసులు చాలా వరకు తగ్గాయన్నారు. కాబట్టి నగరాల్లో సెకండ్​ వేవ్​ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని వివరించారు.

కొత్త స్ట్రెయిన్ల పరిస్థితేంటి?

కేసులు తక్కువగా వస్తున్నాయి కదా అని నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు తమిళనాడుకు చెందిన మరో ఎపిడెమియాలజిస్ట్​ జాకబ్​ జాన్​. ప్రస్తుతానికైతే పరిస్థితి మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు. బ్రిటన్​, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​లో కొత్త స్ట్రెయిన్లు వచ్చినట్టే మన దేశంలోనూ వచ్చే అవకాశాలు ఉండొచ్చన్నారు. కాబట్టి వైరస్​లో జెనెటిక్​ మ్యుటేషన్లను గుర్తించేందుకు మరిన్ని రీసెర్చ్​లు జరగాలని చెప్పారు. అయితే, ఈ కొత్త స్ట్రెయిన్లనూ ఈజీగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఇప్పటికే చాలా మందిలో యాంటీ బాడీలు ఉండడం, వ్యాక్సిన్లూ అందుబాటులోకి రావడం వంటి వాటితో ఆ స్ట్రెయిన్లనూ
జయించొచ్చన్నారు.

ఎప్పటిదాకా ఉంటదో తెల్వదు

కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వ్యాక్సినేషన్​పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు నిపుణులు. ఈ ఎండాకాలం నాటికి 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్రం టార్గెట్​ పెట్టుకుంది. ఆ టార్గెట్​ను అందుకునే అవకాశాలు తగ్గే ముప్పుందని యూనివర్సిటీ ఆఫ్​ మిషిగన్​ బయోస్టాటిస్టీషియన్​ భ్రమర్​ ముఖర్జీ అంటున్నారు. చాలా మంది వ్యాక్సిన్​కు ఇప్పుడేం తొందరలే అనుకునే అవకాశాలూ లేకపోలేదన్నారు. అయితే, భవిష్యత్​లో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందన్నది అంచనా వేయడం, ఇప్పుడు వచ్చిన ఇమ్యూనిటీ ఎన్నాళ్లుంటుందో చెప్పడం కష్టమేనని అంటున్నారు.

ఎందుకు తగ్గినట్టు?

లాక్​డౌన్​ ఎత్తేసినా మన దగ్గర కరోనా కేసులు అంతగా పెరగకపోవడానికి కారణం.. ఇప్పటికే చాలా మంది దాని బారిన పడడమే అని ఎపిడెమియాలజిస్టులు చెబుతున్నారు. నగరాల్లో ఎక్కువ మందికి కరోనా వైరస్​ సోకడం, వాళ్లలో యాంటీ బాడీలు తయారవడం.. కరోనా వ్యాప్తిని స్లో చేసిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్​లాక్​ ప్రకటించినా.. దానికి తగ్గట్టు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమూ మేలు చేసిందని చెబుతున్నారు. సాధారణం గానే ఇండియన్స్​లో ఇమ్యూనిటీ పవర్​ ఎక్కువ. ప్రస్తుత దేశ జనాభాలో యూత్​ ఎక్కువ ఉండడం కూడా వైరస్​ వ్యాప్తి తగ్గడానికి కారణమని పేర్కొంటున్నారు.

యంగ్​ జనరేషన్​తో..

మన దగ్గర కరోనా కంట్రోల్ అవడా నికి చాలా కారణాలు ఉన్నయి. ఇండియాలో కరోనా లేట్‌‌‌‌గా ఎంటర్​ అయింది. ఆ వెంటనే లాక్‌‌‌‌డౌన్ తో వైరస్ స్పీడ్​ తగ్గించాం. మన జనాభా లో యూత్‌‌​ ఎక్కువ. వారిలో కరోనా వచ్చినా అసింప్టమాటిక్‌‌‌‌గానే పోయిం ది. అమెరికా, యూరప్​ దేశాల్లో పెద్ద వయసు వాళ్లు, ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ. ఆసియా కంట్రీల్లో  ఇమ్యూ నిటీ ఎక్కువ. అందుకే డిసీజ్ ట్రాన్స్‌‌‌‌ మిషన్‌‌‌‌, మార్బిడిటీ తక్కువుంటుంది.

– డాక్టర్‌‌‌‌‌‌‌‌ బుర్రి రంగారెడ్డి, హానరరీ