
జనగామ అర్బన్, వెలుగు: హనుమకొండ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్–2026 లాంగ్టర్మ్ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని బీసీడీవో రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 100 మందిని జులై 12న ఆన్లైన్ స్క్రీనింగ్టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గతంలో ప్రిలిమ్స్క్వాలిఫై అయిన మరో 50 మందిని ఎంపిక చేస్తామన్నారు.
టీజీబీసీఈఎస్డీటీసీ, రోడ్ నంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్నందు జులై 8 లోగా దరఖాస్తు అందజేయాలని తెలిపారు. వివరాలకు www.tgbcstudycircle.cgg.gov.in , http://www.tgbcstudycircle.cgg.gov.in , 040-29303130, 040-24071178, 7780359322, 0870-2571192 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.