మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ ను ఆటోతో డాష్ ఇచ్చి మరీ దాడి చేశారు ఆటో డ్రైవర్. ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించినందుకు తీవ్రంగా కొట్టాడు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకిదిగిన పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఆదివారం ( డిసెంబర్ 14) మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ సుధాకర్ బస్టాండులో బస్సు ఆపి టైర్లలో గాలి చెక్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఫరూక్..సుధాకర్ ను ఆటోతో ఢీకొట్టాడు. ఎందుకు డాష్ ఇచ్చావని ఫరూఖ్ ను ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపంతో సుధాకర్ పై ఫరూక్ దాడి చేసి గాయపర్చాడు.
బస్సు డ్రైవర్ సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటో డ్రైవర్ ఫరూక్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
