
దంతాలపల్లి, వెలుగు: దంతాలపల్లి కేజీబీవీలో హిందీ, ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని స్పెషల్ఆఫీసర్ స్వర్ణలత పేర్కొన్నారు. బీఈడీ చేసి, టెట్ క్వాలిఫై అయినవారు విద్యాలయంలో ఈ నెల 21 లోగా దరఖాస్తులు అందించాలన్నారు.
తొర్రూర్ కేజీబీవీలో..
తొర్రూరు, వెలుగు: తొర్రూర్ కేజీబీవీలో క్రాప్ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ఒకేషనల్ కోర్సుకు సంబంధించి ఒక గెస్ట్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని స్పెషల్ఆఫీసర్ శైలజ తెలిపారు. ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎమ్మెస్సీ ఆగ్రోనమీ కోర్సులు చేసిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 21 లోగా విద్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.