రాష్ట్రంలో ఫస్ట్ వేవ్‌కు రెండింతలైన కరోనా కేసులు

రాష్ట్రంలో ఫస్ట్ వేవ్‌కు రెండింతలైన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 6,542 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం బాధితుల సంఖ్య 3,67,901కి చేరింది. కరోనా ఫస్ట్ వేవ్‌లో కరోనా కేసులు మూడు వేలు దాటలేదు. కానీ ఇప్పుడు ఆరు వేలు దాటాయి. దాంతో ఫస్ట్ వేవ్‌లో వచ్చిన కేసుల కన్నా రెండింతల కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మంగళవారం 20 కరోనా మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు రాష్ట్ర్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారిసంఖ్య 1,876కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,887 మంది కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 1,30,105 కరోనా పరీక్షలు నిర్వహించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 898 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 570, రంగారెడ్డి జిల్లాలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్ 263, ఖమ్మం 246, వరంగల్ అర్బన్ 244, కామారెడ్డి 235, జగిత్యాల 230, కరీంనగర్ 203, సిద్దిపేట్ 147, నిర్మల్ 143, యాదాద్రి 140, వికారాబాద్ 135, నాగర్ కర్పూల్ 131, మెదక్ 131, సూర్యాపేట్ 130, భద్రాద్రి కొత్తగూడెం 128, రాజన్న సిరిసిల్ల 124, మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.