కరోనా భయంతో వణుకుతున్న జగిత్యాల, మంచిర్యాల 

కరోనా భయంతో వణుకుతున్న జగిత్యాల, మంచిర్యాల 

జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది. రెండు నెలల్లోనే దాదాపు ఎనిమిదిన్నర వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తిపై మంత్రి ఈటెల రాజేందర్, గంగుల  కమలాకర్ ఇప్పటికే రివ్యూ చేశారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలతోనే జగిత్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందంటున్నారు అధికారులు. మహారాష్ట్ర చెక్ పొస్టు దగ్గర కరోనా టెస్టులు చేసిన తర్వాతే రాష్ట్రంలోని అనుమతించాలని జిల్లా వాసులు అంటున్నారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు వర్రీ అవుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో మహారాష్ట్ర నుంచి వచ్చే కరోనా వ్యక్తుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. మహారాష్ట్ర నుంచి కరోనా కేసుల వారితో వచ్చినవారు లాడ్జిల్లో ఉండటం, హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో తిరగడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన చాలామంది కరోనా బాధితులు.. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరోనా సోకిన వారితో వచ్చిన బంధువులు, సహాయకులతో మంచిర్యాలలో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.