తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.నిన్న(గురువారం) రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా...లేటెస్టుగా 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా భారీగా కేసులు నమోదయ్యాయి.దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ(శుక్రవారం) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు  వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. GHMC పరిధిలో 510 కేసులు నమోదయ్యాయి.