న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో ఇండియన్ కన్జూమర్లు అలవాట్లు, అభిరుచులు మారిపోయాయి. ప్రజలు ఖర్చులను కూడా కుదించారు. అవసరమైన వాటి పైనే ఖర్చు పెడుతున్నారు. ఆరోగ్యానికే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్జూమర్ల అలవాట్లు మారడంతో కొన్ని కంపెనీలు బాగా లాభపడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు బాగా నష్టపోతున్నాయి. కరోనా మహమ్మారి టైమ్‌లో ఇండియన్లు తమ డబ్బును ఎక్కువగా వేటిపై ఖర్చు చేశాయో ఓ సారి చూద్దాం…
ఇమ్యూనిటీ బూస్టర్స్…
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ఆరోగ్యం భద్రంగా ఉంచుకునేందుకు దృష్టి పెట్టారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారు. దీంతో డాబర్ ఇండియా లిమిటెడ్, హిమాలయ డ్రగ్ కో వంటి కంపెనీల ప్రొడక్టర్లకు బాగా డిమాండ్ వచ్చింది. తేనె, చక్కెర, నెయ్యి, మూలికలు, మసాలా దినుసులతో తయారు చేసినచ్యవాన్ ప్రాష్ వంటి ట్రెడిషినల్ ప్రొడక్లను ట్ ప్రజలు వాడుతున్నారు. ఆయుర్వేదిక్ ఇంగ్రిడియెంట్స్‌తో తయారు చేసే ప్రొడక్లను ట్ ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. చ్యవాన్ ప్రాష్ సేల్స్ జూన్ నెలలో 283 శాతం పెరిగాయి. బ్రాండెడ్ హనీ సేల్స్ 39 శాతం ఎగిసినట్టు నీల్సన్ హోల్డింగ్స్ ఇంక్ సర్వేలో తేలింది. దేశంలో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ సప్లయిర్స్‌లో ఒకటైన డాబర్ చ్యవన్ ప్రాష్ సేల్స్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో 700 శాతం పెరిగినట్టు వెల్లడించింది. మరికొన్ని నెలల పాటు వీటి సేల్స్ పెరుగుతూనే ఉంటాయని నీల్సన్ సౌత్ ఆసియా వెస్ట్మార్కెట్ లీడర్ సమీర్ శుక్లా తెలిపారు. ఇమ్యూనిటీ బూస్టర్స్, హెల్త్ హైజీన్లపైనే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు.బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ సేల్స్ కూడా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో బాగా పెరిగినట్టు రిపోర్ చేట్ సింది.
కంఫర్ట్ ఫుడ్స్ ….
కరోనాతో మార్చి నుంచి ప్యాకేజ్డ్ఫుడ్స్ సేల్స్ పెరిగాయి. తృణధాన్యాలు, ఇన్‌స్టాంట్ నూడుల్స్, రైస్ వంటివి వాటిల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు తెలిసింది. నెస్లేఇండియా లిమిటెడ్‌కు చెందిన ఇన్‌స్టాంట్ మ్యాగీ నూడుల్స్‌కి బాగా పాపులారిటీ వచ్చింది. మ్యాగి, కిట్‌కాట్, మంచ్ వంటి సేల్స్ పెరగడంతో మార్చితోముగిసిన క్వార‌్టర్ లో కంపెనీ రెవెన్యూ గ్రోత్ 10.7 శాతం పెరిగినట్టు హైటాంగ్ సెక్యూరిటీస్ కో అనలిస్స్ ట్ గౌరాంగ్ కక్కాడ్, ప్రేమల్ కామ్దార్ చెప్పారు. పార్లేప్రొడక్ట్స్ కూడా ఈ కరోనా లాక్‌డౌన్ కాలంలో పార్లేజీ బిస్కెట్స్ బాగా అమ్ముడుపోయినట్టుతెలిపింది. ఏప్రిల్–మే నెలల్లో రికార్డు సేల్స్‌ను నమోదు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు ఎక్కువగా పార్లేజీ బిస్కెట్స్‌ను పంపిణీ చేసివారి ఆకలిని తీర్చారని చెప్పింది. ప్రజలు కూడా తేలికగా కొనుక్కొని తినేలా వీటి కాస్ట్ఉందన్నారు. ఇన్‌హోమ్ కన్జంప్షన్ పెరగడంతో ప్యాకేజ్ డ్ ఫుడ్ కన్జంప్షన్ లో బలమైన గ్రోత్ నమోదైందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది.
డిజిటల్ సర్వీసెస్…
కరోనా లాక్‌డౌన్‌డిజిటల్ సర్వీసెస్‌కు ఒక ఊపు తెచ్చింది. స్కూల్స్ మూతపడటం, ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రాకపోవడంతో డిజిటల్ వాడకం విపరీతంగా పెరిగింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ బైజూస్ వాడకం మూడింతలు పెరిగినట్టు దాని పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ తెలిపింది. దీంతో బైజూస్ కొత్తగా స్థానిక భాషల్లో కోర్సులను ప్రవేశపెట్టింది. మరిన్ని సబ్జెట్లను తమ ప్లాట్‌ఫామ్ పై లాంఛ్ చేసింది. మార్చి నుంచి ల్యాప్‌టాప్‌ల సెర్చ్‌లు కూడా రెండింతలు పెరిగినట్టు ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ ఇంక్ ప్రత్యర్థి అయిన జీ5 డైలీ యాక్టివ్ యూజర్లు 33 శాతం పెరిగారు. మేలో యాప్ డౌన్‌లోడ్స్ 45 శాతం ఎగిశాయి.
గోల్డ్ లోన్స్ జోరు..
ఎకానమీ ప్రమాదంలో పడటంతో చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. కంపెనీలు కరోనా నష్టాలను తట్టుకోలేక ఉద్యోగులపై వేటు వేశాయి. దీంతో దిక్కుతోచని ప్రజలు తమ వద్దనున్న అరకొర బంగారాన్ని బ్యాంక్ ల వద్ద తనఖా పెట్టి అప్పులు తీసుకున్నారు. చిన్న వ్యాపారాల ఓనర్లు కూడా బంగారంపైనే ఎక్కువగా లోన్లు తీసుకుని బిజినెస్‌లను రన్ చేస్తున్నారు. దీంతో కొన్ని కంపెనీలు బాగా లాభపడుతున్నాయి. ఇండియాలో గోల్డ్ లోన్స్ఇచ్చే అతిపెద్ద కంపెనీ మథూట్ ఫైనాన్స్ షేర్లు ఈ ఏడాది 57 శాతం పెరిగాయి.
