అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 13 వేలు దాటింది. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అదే స్థాయిలో మరణాలు తగ్గడం లేదు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 16 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య ఇవాళ ఆదివారం నాడు 13 వేలు దాటింది. నిన్నటి వరకు కరోనా మృతుల సంఖ్య 12 వేల 986 ఉండగా.. ఇవాళ 16 నమోదు కావడంతో ఈ సంఖ్య 13 వేల 2కు చేరుకుంది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 91 వేల 677 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 2వేల 665 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 19 లక్షల 22 వేల 843కు చేరుకుంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3 వేల 231 మంది కరోనా నుంచి చికిత్స ద్వారా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాస్ట్రంలో యాక్టివ్ కేసులు 28 వేల 680 ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది. ఏపీలోని జిల్లాల వారీగా గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి..