10 రోజుల లాక్ డౌన్ తో కరోనా తగ్గుతుంది: కేటీఆర్

10 రోజుల లాక్ డౌన్ తో కరోనా తగ్గుతుంది: కేటీఆర్

హైదరాబాద్: 10 రోజుల లాక్ డౌన్ తర్వాత కరోనా తగ్గిపోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి లపై మంత్రి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. చీఫ్ సెక్రెటరీతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చికిత్స తదితర అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కంట్రోల్ పై  తీసుకుంటున్న చర్యల ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. రాష్ట్రంలో  హోం ఐసోలేషన్ లో ఉన్న వాళ్లకు  కిట్లు  కూడా  ఇస్తున్నామన్నారు. దీని ద్వారా హాస్పిటల్ రావాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. మన అవసరాలకు సరిపడ  రేమిడిసివర్ ఇంజక్షన్ లు ఉన్నాయని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో అవసరం లేకపోయినా వాడుతున్నారని,  చాలా మంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు  ఆక్సిజన్ వాడకం  పై ఆడిట్ చేస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మంత్రులు కరోనా పై   సమీక్షలు చేశారని వివరించారు.  వ్యాక్సినేషన్ పై కూడా చర్చించామని, అయితే ఈ వ్యాక్సిన్ మొత్తం కేంద్రం పరిధిలో ఉందన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు, రేమిడిసివర్ ఇంజక్షన్ తయారీ దారులతో కూడా త్వరలోనే మాట్లాడతమాని.. 10 రోజుల లాక్ డౌన్ తో మన రాష్ట్రంలో  కరోనా తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా నియంత్రణ లో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.