కొండాపూర్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ లో క‌రోనా డోసులు మాయం

కొండాపూర్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ లో క‌రోనా డోసులు మాయం

హైద‌రాబాద్: క‌రోనా టీకాలు మాయం కావ‌డంతో వివాదాస్ప‌దంగా మారిన‌ సంఘ‌ట‌న శ‌నివారం కొండాపూర్ ప్రభుత్వ హాస్పిట‌ల్ లో జ‌రిగింది. వ్యాక్సినేషన్ సెంటర్ ఉన్న 500 మందికి ఇచ్చే క‌రోనా డోసులు మాయం అయినట్టు ఆడిట్ లో వెల్లడి కావ‌డంతో..ఆస్పత్రి సిబ్బందిపై గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు సూపరిండెంట్ దశరథ్. దీంతో కార‌ణంలేకుండా అన్యాయంగా తమపై కేసులు పెట్టారని నర్సులు, అటెండర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ్యాక్సినేషన్ లో సూపరిండెంట్ అవకతవకలకు పాల్పడ్డారని..ఇప్పుడు కావాల‌నే త‌మ‌పై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని ఆసుపత్రి సిబ్బంది సీరియ‌స్ అవుతున్నారు. పోలీసుల‌ను పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు.

విచార‌ణ చేప‌ట్టాం

కొండాపుర్ జిల్లా హాస్పిటల్‌లో కొవిషిల్డ్ వాయిల్స్ మిస్సింగ్‌పై విచారణ కొనసాగుతోందని.. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. కొండాపుర్ జిల్లా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉందన్నారు పోలీసులు