కరోనా ఎఫెక్ట్: కూలీగా మారిన PHD లెక్చరర్

కరోనా ఎఫెక్ట్: కూలీగా మారిన PHD లెక్చరర్

కడప జిల్లా: కరోనా ఎఫెక్ట్ తో ఎంతో మంది జీవితాలు ఆగమైన విషయం తెలిసిందే. చిరు వ్యాపారుల నుంచి PHD చేసిన వాళ్లు కూడా రోడ్డున పడ్డారు. కడప జిల్లాలో పీహెచ్ డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందిన ఓ లెక్చరర్ కరోనా దెబ్బకు కూలీగా మారారు. ఖాజీపేట మండలం, తవ్వారుపల్లెకు చెందిన డాక్టర్. తవ్వా వెంకటయ్య తెలుగు సాహిత్యంలో PHD పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.

ఖాజీపేటలోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుండగా.. కరోనా వల్ల కాలేజీ మూత పడటంతో యాజమాన్యం జీతలు ఇచ్చుకోలేక పోయింది. దీంతో కుటుంబ పోషణ కోసం పొలంలో కూలి పనికి వెళ్తున్నారు డాక్టర్ వెంకటయ్య. ఉద్యోగం దొరక్క, ప్రైవేటు ఉద్యోగం కూడా పోవటంతో ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్.. మేము అతడిని సంప్రదించాలనుకుంటున్నాము. మరిన్ని వివరాలు ప్లీజ్ అని ట్వీట్ చేశాడు. అతడికి ఎలాగైనా సాయ అందించాలని పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.