గాంధీలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా!

V6 Velugu Posted on Jan 17, 2022

తెలంగాణలో థర్డ్ వేవ్ కరోనా కమహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా వైద్య సేవలు అందించే డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాదులోని గాంధీ  ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.  ఏకంగా 120 వైద్యసిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా ఈ స్థాయిలో డాక్టర్లు కరోనా బారిన పడటంతో ఇతర సిబ్బందిలో తీవ్ర ఆందోళన మొదలైంది. మరికొందరు సిబ్బందికి చెందిన కొవిడ్ రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం..

ఎర్రగడ్డ హాస్పిటల్లో కరోనా కలకలం

Tagged corona, 120 medical staff, hyderabad Gandhi

Latest Videos

Subscribe Now

More News