రాష్ట్రంలో మరో 246 మందికి కరోనా

రాష్ట్రంలో  మరో 246 మందికి కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 246  కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా మరణాలేమి నమోదు కాలేదు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 185, రంగారెడ్డి19,  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 14 పాజిటివ్ లు నమోదయ్యాయి.  ఇప్పటివరకు7,96,301 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 7,90,073 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కోలుకున్న వారి కన్నా కొత్తకేసులే అధికంగా ఉండటంతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,117 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు.