కరోనా కొత్త వేరియంట్లతో ముప్పు లేదు

కరోనా కొత్త వేరియంట్లతో ముప్పు లేదు

పద్మారావునగర్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్లతో పెద్దగా ముప్పేమీ ఉండదని గాంధీ ఆస్పత్రి డీఎంఈ డాక్టర్ కె. రమేశ్​రెడ్డి అన్నారు. ఒమిక్రాన్​ బీఎఫ్–7కు భయపడొద్దని, కానీ అల్టర్ గా ఉండాలని సూచించారు. గాంధీ హాస్పిటల్​లో మంగళవారం నిర్వహించిన కొవిడ్​ మాక్​డ్రిల్‌‌‌‌ సందర్భంగా రమేశ్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త వేరియంట్ కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సిటీలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ​జరిగిందని, ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిందన్నారు. 

అలర్ట్​గా ఉంటూ మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. సూపరింటెండెంట్​డాక్టర్ రాజారావు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఆక్సిజన్, వైద్య సిబ్బంది కొరత లేదని తెలిపారు. 650 ఐసీయూ బెడ్స్, 600 ఆక్సిజన్ బెడ్స్​తో పాటు మొత్తం 1,890 బెడ్స్​ఉన్నట్లు తెలిపారు. 530 వెంటిలేటర్లు​ ఉండగా ఇందులో 518 వర్కింగ్ కండీషన్‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. ఈ మాక్​డ్రిల్‌‌‌‌లో భాగంగా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్, ఓపీ, ఆక్సిజన్ ​ప్లాంట్లు, ఆక్సిజన్​లిక్విడ్ ​సిలిండర్ల ఏరియాలను సందర్శించి వివరాలు నమోదు చేశారు.