కరోనా సెకండ్ వేవ్ వచ్చినా రెడీ

కరోనా సెకండ్ వేవ్ వచ్చినా రెడీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందన్నారు. కేంద్ర మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో ఈటలతో మాట్లాడారు. రాష్ర్టంలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కేసులు, మరణాలు, ఇతరత్రా వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి డిస్ర్టిక్ట్ హాస్పిటళ్ల వరకు అన్ని చోట్లా కరోనా టెస్టులు చేస్తున్నామని, ప్రతి వందలో ఐదుగురికే పాజిటివ్ వస్తోందని ఆయనకు ఈటల వివరించారు. ప్రతి 8 మందిలో ఒకరికి టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశామని, మొత్తం టెస్టులు 46 లక్షలు దాటాయని చెప్పారు. కరోనా కోసం కేటాయించిన బెడ్లలో 85 శాతం ఖాళీగా ఉంటున్నాయని, 12 నుంచి 15 శాతం ఆక్యుపెన్సీనే ఉంటోందన్నారు.  వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ పంపిణీ, ప్రియారిటీ విషయాలపై సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలను హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌ అభినందించారని ఈటల ఓ ప్రకటనలో వెల్లడించారు.  వ్యాక్సిన్ రావడానికి మరో వంద రోజులు పడుతుందని చెప్పినట్టు సమాచారం.