గంట‌న్న‌ర ముందే స్టేష‌న్ కి రావాలి.. మీరే దుప్ప‌ట్లు తెచ్చుకోండి: రైల్వే శాఖ‌

గంట‌న్న‌ర ముందే స్టేష‌న్ కి రావాలి.. మీరే దుప్ప‌ట్లు తెచ్చుకోండి: రైల్వే శాఖ‌

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన ప్యాసింజ‌ర్ రైళ్లు మే 12 నుంచి మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతున్నాయి. ఇప్ప‌టికే మే 1 నుంచి వ‌ల‌స కూలీలను స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు న‌డుపుతున్న రైల్వే శాఖ‌.. ఇప్పుడు తాజాగా ఇత‌ర ప్ర‌యాణికుల కోసం స్పెష‌ల్ ట్రైన్ న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 15 మేజ‌ర్ సిటీల‌తో న్యూఢిల్లీని క‌లుపుతూ 30 స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేస్తోంది. వీటికి బుకింగ్ కూడా సోమ‌వారం సాయంత్రం మొద‌లుపెట్టింది రైల్వే శాఖ‌. తొలి ద‌శ‌లో కేవ‌లం ఏసీ రైళ్లు మాత్ర‌మే న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ద‌శ‌ల వారీగా ఇత‌ర రైళ్ల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపింది. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌యాణాలు సాగించేందుకు కొన్నిసూచ‌న‌లు చేసింది.

– ప్ర‌స్తుతం ప్ర‌యాణాలు చేయాల‌నుకున్న వారు కేవ‌లం ఆన్ లైన్ లో ఐఆర్సీటీసీ వెబ్ సైట్, యాప్ లో మాత్ర‌మే టికెట్ బుకింగ్ చేసుకోవాలి. స్టేష‌న్ కౌంట‌ర్లు, రైల్వే, ఐఆర్సీటీసీ ఏజెంట్ల వ‌ద్ద టికెట్ బుకింగ్ అందుబాటులో ఉండ‌దు.

– ప్ర‌స్తుతం గ‌రిష్ఠంగా ఏడు రోజుల ముందుగా మాత్ర‌మే టికెట్ అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకునే వీలు క‌ల్పించింది రైల్వే శాఖ‌.

– క‌న్ఫామ్ టికెట్ ఉన్న‌వారికి మాత్ర‌మే ప్ర‌యాణం చేసే అవ‌కాశం ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్ల‌తో జ‌ర్నీ చేసేందుకు అనుమ‌తి లేదు.

More News:

మే 12 నుంచి ట్రైన్స్ స్టార్ట్: వ‌రంగ‌ల్, విజ‌య‌వాడ స‌హా రైలు ఆగే స్టేష‌న్స్ ఇవే..

రైలు ప్ర‌యాణాల‌కు కేంద్ర హోం శాఖ‌ మార్గ‌ద‌ర్శ‌కాలు

క‌రెన్సీ నోట్లు, సెల్ ఫోన్స్ శానిటైజ్ చేసే మెషీన్.. హైద‌రాబాద్ లోనే త‌యారీ

– ఎవ‌రైనా క‌న్ఫామ్ అయిన‌ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల‌నుకుంటే ట్రైన్ బ‌య‌లుదేరే 24 గంట‌ల ముందే చేసుకోవాలి. ఇలా క్యాన్సిల్ చేసుకున్న వారికి 50 శాతం మాత్ర‌మే డ‌బ్బులు రీఫండ్ అవుతాయి.

– ప్ర‌యాణికుల‌ను స్టేష‌న్ కు వ‌దిలిపెట్టే వాహ‌న‌దారుడికి కూడా ఆ టికెట్ పాస్ లా ప‌ని చేస్తుంది.

– క‌నీసం 90 నిమిషాల ముందుగానే ప్ర‌యాణికులు స్టేష‌న్ కు చేరుకోవాలి. అక్క‌డ ప్ర‌తి ఒక్క‌రికీ స్క్రీనింగ్ చేసి.. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే జ‌ర్నీ చేసేందుకు అనుమ‌తిస్తారు.

– స్టేష‌న్ లో, ట్రైన్ లోకి ఎక్కేట‌ప్పుడు/దిగేట‌ప్పుడు, ప్ర‌యాణ స‌మ‌యంలోనూ సోష‌ల్ డిస్టెన్ పాటించ‌డం, మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.

– ఆన్ లైన్ లోనే ఫుడ్ బుక్ చేసుకునే స‌దుపాయాన్ని నిలిపేసిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రైన్ లో రెడీ టూ ఈట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయ‌ని, అయితే ప్ర‌యాణికులు ఇంటి నుంచే ఆహారం, వాట‌ర్ బాటిల్స్ తెచ్చుకోవ‌డం మేల‌ని సూచించింది.

– ఏసీ బోగీల్లో కిటీకీల క‌ర్టెన్స్ తొల‌గిస్తున్న‌ట్లు చెప్పింది రైల్వే శాఖ‌. అలాగే దుప్ప‌ట్లు, ట‌వ‌ల్స్ కూడా ఉండ‌వ‌ని, అవ‌స‌ర‌మైన వారు ఇంటి నుంచే తెచ్చుకోవాల‌ని కోరింది.

– ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.