సెకండ్​వేవ్ ​కట్టడికి కరోనా మొబైల్​ టెస్ట్​లు

సెకండ్​వేవ్ ​కట్టడికి  కరోనా మొబైల్​ టెస్ట్​లు
  •     ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న ఆరోగ్యశాఖ
  •     రద్దీ ప్రాంతాల్లో ఉచితంగా పరీక్షలు చేయాలని నిర్ణయం
  •     సమాచారమిస్తే ఫంక్షన్లలోనూ..

నల్గొండ, వెలుగు: కరోనా వైరస్​ సెకండ్​ వేవ్ కట్టడికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇప్పటివరకు సర్కారు ఆసుపత్రుల్లో టెస్ట్​లు చేయగా ఇకపై మొబైల్​ ప్రోగ్రాంగా చేపట్టాలని ని ర్ణయించారు. ఇటీవలి కాలంలో కరోనా టెస్ట్​లు చేయించుకునే వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా తగ్గింది. టెస్ట్​లు తగ్గడంతో పాజిటివ్​ కేసులు కూడా కంట్రోల్ లో ఉన్నాయి. కానీ ప్రజలు కరోనా రూల్స్​ అతిక్రమించి సాధారణ జీవనానికి అలవాటుపడిపోయారు. మాస్క్​లు ధరించకపోవడం, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించకపోవడం, శానిటైజర్​ వాడకం తగ్గించారు. ఒకరకంగా చె ప్పాలంటే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వరుస పండుగలు, ఫంక్షన్ల హడావుడితో పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజల రద్దీ పెరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో షాపింగ్​మాల్స్, సూపర్​మార్కెట్లు, ఫంక్షన్​ హాల్స్, బార్​ అండ్​ రెస్టారెంట్లు, వైన్స్​లు ఫుల్​టైం పని చేస్తున్నాయి. కరోనా ఫస్ట్​ఫేజ్​లో పాటించిన రూల్స్​ఏవీ ఇప్పుడు సక్రమంగా అమలు చేయడం లేదు. దీంతో ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి ఉచితంగా కరోనా టెస్ట్​లు చేయాలని వై ద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పింది.

జనాలు వచ్చిపోయే ప్రాంతాల్లో..

గతంలో రోజుకు మూడు వేల వరకు కరోనా టెస్ట్​లు చేశారు. కొంతకాలంగా నల్గొండ జిల్లాలో టెస్ట్​ల సంఖ్య 1,700 మించడం లేదు. పరీక్ష చేసిన వాటిలో పాజిటివ్​ కేసులు 40 నుంచి 60 వరకు నమోదవుతున్నాయి. చలికాలంలో వైరస్​వ్యాప్తి పెరిగే చాన్స్​ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నా  ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండటం లేదు. పైగా మాకెందుకు కరోనా టెస్ట్​లు,  మేం ఎందుకు చేయించుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా తెలిసింది. ఈ పరిస్థితిని చూసీచూడనట్లుగా వదిలేస్తే కరోనా సెకండ్​వేవ్​కట్టడి చేయడం సులువు కాదని భావించిన ఆఫీసర్లు అలర్ట్​అయ్యారు. దీనికోసం ఎక్కువగా జనాలు వచ్చిపోయే షాపింగ్​మాల్స్, సూపర్​ మార్కెట్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి పదిరోజులకోసా రి కరోనా టెస్ట్​లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఫంక్షన్లు జరిగే ప్రాంతాల్లో అతిధులు ఎంతమంది వస్తారనే ముందస్తు సమాచారం హెల్త్​స్టాఫ్​కు అందిస్తే మొబైల్​ వెహికల్​లో వచ్చి టెస్ట్​లు చేస్తారు. వచ్చిపోయే జనాలు ఉన్న ఏరియాల్లోనే సిబ్బందికి టెస్ట్​లు చేస్తారు. దీని వల్ల వైరస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా కంట్రోల్​ చేయొచ్చని వైద్య ఆరోగ్య శాఖ ప్లాన్​ చేసింది.

డిసెంబర్​1 నుంచి అమలు

డిసెంబర్​ 1 నుంచి కరపత్రాల రూపంలో పట్టణాల్లో ప్రచారం నిర్వహించేలా హెల్త్​ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లోని వర్తక, వ్యాపార సంస్థల యజమానులకు మొబైల్​ టెస్ట్​ల గురించి హెల్త్​ స్టాఫ్​తో చెప్పిస్తారు. వ్యాపార సంస్థల ఓనర్లు కరోనా టెస్ట్​లు చేయమని కోరిన వెంటనే హెల్త్​ స్టాఫ్​ను పంపించి సిబ్బందిని పరీక్షిస్తారు. చలికాలంలో సోకే దగ్గు, జలుబు లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. కరోనా లక్షణాల్లో ఇవి కూడా ఉండటంతో వాటి గురించి జనంలో ఉన్నటువంటి అపోహలను తొలగిస్తా రు.