బీట్ రూట్ తిన్నా..బీట్ రూట్ జ్యూస్ తాగినా ఎన్ని లాభాలో..

బీట్ రూట్ తిన్నా..బీట్ రూట్ జ్యూస్ తాగినా ఎన్ని లాభాలో..

బీట్ రూట్ అనేది ఎన్నో పోషకాలున్న ఓ అద్భుతమైన దుంప కూరగాయ. దీనిని నేరుగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బీట్ రూట్ జ్యూస్ త్వరగా శరీరంలోకి ఇంకిపోయి దానిలోని పోషకాలను అందిస్తుంది.

బీట్‌రూట్ అనేక విధాలుగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా దానిలోని అధిక నైట్రేట్ కంటెంట్ శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను సడలించి వెడల్పు చేస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది. అదనంగా బీట్‌రూట్ వాపును తగ్గిస్తుంది.

మూత్రపిండాల పనితీరుకు సపోర్టు చేస్తుంది. బరువు,కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. ఇవన్నీ మొత్తం గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణకు సాయపడతాయి. 

ఆహార నైట్రేట్లు సమృద్ధిగా..

బీట్‌రూట్‌లో సహజంగా ఉండే నైట్రేట్లను శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్త నాళాలను సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.దీని వలన బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది. 

వాస్కులర్ పనితీరుపై..

క్రమం తప్పకుండా బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఎండోథెలియల్ పనితీరు మెరుగుపడుతుంది. ధమనులు సరళంగా ,దృఢత్వం తక్కువగా ఉండటానికి సహాయపడుతుంది. దీంతో రక్తప్రసరణ బాగుంటుంది. రక్తపోటు ప్రమాదం ఉండదు. 

సహజ వాసోడైలేటర్‌గా ..

బీట్‌రూట్ సహజంగా రక్త నాళాలను విస్తరిస్తుంది. ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ముఖ్యంగా తిన్న కొన్ని గంటల్లోనే.సిస్టోలిక్ , డయాస్టొలిక్ ఒత్తిడి రెండింటినీ తగ్గిస్తుంది. 

వాపును తగ్గించడంలో.. 

బీట్ రూట్ లో అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బీటాలైన్లు రక్త నాళాలలో వాపును తగ్గిస్తాయి. మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. బీపీ కంట్రోల్ చేసేందుకు సపోర్టు చేస్తుంది. 

నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది..

నైట్రిక్ ఆక్సైడ్ ధమనులను వెడల్పు చేస్తుంది. ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది.బీపీ స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. బీట్‌రూట్ రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు స్థిరంగా పెరుగుతాయి.

కిడ్నీ పనితీరుకు సపోర్టు.. 

ఆరోగ్యకరమైన మూత్రపిండాలు రక్తపోటును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీట్‌రూట్ మూత్రపిండాల నిర్విషీకరణ ,రక్త వడపోతకు సపోర్టు చేస్తుంది. ఇది శరీరంలో ద్రవం ,సోడియం సమతుల్యతకు సాయం చేస్తుంది. 

బరువు ,కొలెస్ట్రాల్‌ నియంత్రణ.. 

బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది .చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. బరువు ,కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి పరోక్షంగా గుండె నాళాల సిస్టమ్ పై ఒత్తిడి తగ్గిస్తుంది. బీపీని నార్మల్ గా ఉంచుతుంది.