
ఓటర్ ఐడీ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఇకపై కొత్త ఓటర్ కార్డులు 15 రోజుల్లో డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఓటర్ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ప్రస్తుతం ఓటర్ కార్డు డెలివరీకి నెలరోజుల కంటే ఎక్కువ సమయం పడుతున్న క్రమంలో ఎన్నికల సంఘం తాజా నిర్ణయం కీలకంగా మారింది.
అంతే కాకుండా ఓటర్ కార్డు ట్రాకింగ్ సిస్టం కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఈ సిస్టం ద్వారా ఓటర్ కార్డు అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్క అప్డేట్ స్వతహాగా దరఖాస్తుదారులే తెలుసుకోవచ్చని తెలిపింది ఎన్నికల సంఘం. దీంతో దరఖాస్తుదారుల టైం సేవ్ అవుతుందని తెలిపింది.
ఓటర్ ఐడీ కార్డు ఎలా అప్లై చేయాలి:
- NVSP పోర్టల్: అధికారిక జాతీయ ఓటర్ల సేవల పోర్టల్ (NVSP) కి లాగిన్ అవ్వండి.
- సైన్ అప్ : రైట్ సైడ్ కార్నర్ లో కనిపించే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి.. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి.
- అకౌంట్ క్రియేట్ చేసుకోండి: పేరు, పాస్ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత OTP ని ఎంటర్ చేయండి.
- లాగిన్ అవ్వండి : మీ అకౌంట్ కి లాగిన్ అవ్వడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చాను ఎంటర్ చేయండి . ఆ తర్వాత మీ మొబైల్ కి వచ్చిన మరొక OTP ని ఎంటర్ చేయండి.
- ఫామ్ 6 నింపండి :" ఫిల్ ఫామ్ 6 " పై క్లిక్ చేయండి. పర్సనల్, రిలేటివ్, కాంటాక్ట్, అడ్రస్ కి సంబందించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
- డాక్యూమెంట్స్ అప్లోడ్ చేయండి : అవసరమైన డాక్యూమెంట్స్ అప్లోడ్ చేసి.. ప్రివ్యూ చెక్ చేసుకోండి.
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి: ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
ఓటర్ ఐడీ కార్డును ట్రాక్ చేయడం ఎలా:
- NVSP పోర్టల్ కి లాగిన్ అవ్వండి.
- ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి.
- రెఫరెన్స్ నంబర్ ఎంటర్ చేయండి. ( ఫామ్ 6 సబ్మిట్ చేశాక వచ్చేది )
- రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే .. మీ ఓటర్ కార్డు అప్డేట్ తెలుసుకోవచ్చు.
ఈ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఓటర్లకు ప్రతి దశలో టెక్స్ట్ మెసేజ్ లు, నోటిఫికేషన్లు పంపనుంది ఎన్నికల సంఘం. అంతే కాకుండా ఓటర్ల సమాచార భద్రతను కూడా మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం.