ఒమిక్రాన్​ టెన్షన్​..  వ్యాక్సిన్​కు క్యూ

V6 Velugu Posted on Dec 04, 2021

ఎల్​బీనగర్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్​ఒమిక్రాన్​తో  సిటీ జనాల్లో  టెన్షన్​ పట్టుకుంది.  కరోనా కేసులు ఆరు నెలలుగా  తగ్గుతుండగా ప్రజలు ఇప్పుడిప్పుడే  కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.  ఇంతలోనే  ఫారిన్ ​నుంచి వచ్చి వారిలో ఒమిక్రాన్  వస్తుందనడంతో మరోసారి భయాందోళనలో పడిపోయారు. ఇప్పటి వరకు రెండు డోస్ లు వ్యాక్సిన్​ తీసుకోని వారు సెంటర్లకు క్యూ కడుతున్నారు.  దీంతో  వ్యాక్సినేషన్ సెంటర్ల లో రద్దీ నెలకొంటుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలెర్ట్ చేయగా థర్డ్ ​వేవ్ ​వస్తుందేమోనని భయంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు  సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఐదు రోజుల వరకు  ఖాళీ గా ఉన్న సెంటర్లు రెండు రోజుల నుంచి ఫుల్​గా కనిపిస్తున్నాయి. 

పెరుగుతున్న టెస్టులు
కరోనా టెస్ట్ సెంటర్ల వద్ద అనుమానితులు సంఖ్య పెరుగుతుంది. ఏ చిన్న హెల్త్​ ప్రాబ్లమ్​ అనిపించినా వెంటనే టెస్ట్​ సెంటర్లకు వెళ్తున్నారు. ఏరియా ఆస్పత్రి, పీహెచ్ సీల్లో రోజుకు సుమారు 100 మంది అనుమానితులు టెస్ట్ లకు పోతున్నారు.  

మాస్క్ లేకపోతే సీరియస్ యాక్షన్
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కొత్త వేరియంట్ విజృంభించకుండా ఉండేందుకు మాస్కులు మస్ట్​ చేసిం ది. మాస్క్​ పెట్టుకోకుంటే  రూ.1000 ఫైన్​ వేస్తామని అధికారులు హెచ్చరించడంతో  జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే వనస్థలిపురం పోలీసులు మాస్క్ లు ధరించకుండా వాహనాలపై వెళ్తున్న వారికి ఫైన్లు వేస్తున్నారు. ఇలా వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారు 20కేసుల్లో ఫైన్​ వేశారు. బల్దియా అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఒమిక్రాన్‌‌‌‌ వేరియంట్‌‌‌‌తో గ్రేటర్  పోలీసులు అలర్ట్ అయ్యారు.   మాస్క్ లేని వారికి రూ.వెయ్యి ఫైన్ వేస్తున్నారు. ఫస్ట్‌‌‌‌ వేవ్‌‌‌‌, సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ కరోనా తీవ్రంగా ఉన్న సమయాల్లో ఈ యాక్ట్‌‌‌‌ను పటిష్టంగా అమలు చేశారు.

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో  గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్ల లిమిట్స్‌‌‌‌లో మాస్క్‌‌‌‌ రూల్‌‌‌‌ ను తప్పనిసరి చేశారు . గ్రౌండ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో పనిచేసే బ్లూ కోల్ట్స్‌‌‌‌,పెట్రోలింగ్‌‌‌‌ పోలీసులతో మాస్క్‌‌‌‌ రూల్స్ బ్రేక్‌‌‌‌  చేసే వారిపై నిఘా పెట్టారు.  వాహనదారులతో పాటు  షాపింగ్‌‌‌‌ మాల్స్, మార్కెట్లు, షాప్ లు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు కరోనా గైడ్ లైన్స్ పాటించాలని సూచిస్తున్నారు. శానిటేషన్‌‌‌‌, మాస్క్ వయొలేషన్‌‌‌‌ చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్‌‌‌‌ లేని వారిని ట్యాబ్‌‌‌‌లో ఫొటో తీస్తున్నారు. మొబైల్‌‌‌‌ నంబర్, ఫుల్‌‌‌‌ అడ్రెస్‌‌‌‌తో ఫొటోను పోలీస్‌‌‌‌ సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోని వారిపై నమోదు చేసిన కేసు వివరాలను సంబంధిత వ్యక్తి సెల్ ఫోన్ కు మెసేజ్ చేస్తున్నారు.  కోర్టుకు హాజరు కావల్సిన వివరాలు తెలుపుతున్నారు.

మాస్క్‌‌‌‌ రూల్స్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేసిన వారిపై కోర్టులు రూ.వెయ్యి ఫైన్ విధిస్తున్నాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు హోంగార్డులను మాస్క్ వయొలేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో మాస్క్ లేని 150 మందిపై కేసులు నమోదు చేసి రూ. వెయ్యి చొప్పున ఫైన్ విధించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం 38, శుక్రవారం 28 మాస్క్ వయొలేషన్ కేసులు నమోదైనట్లు సీపీ మహేశ్​భగవత్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఇప్పటివరకు లక్షా 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు. ఒమిక్రాన్ తో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
 

Tagged TS Corona Cases, hyderabad corona cases, Corona New Variant, omicron virus

Latest Videos

Subscribe Now

More News