జూన్ చివ‌రి వ‌ర‌కు క‌రోనా త‌గ్గే అవ‌కాశం

జూన్ చివ‌రి వ‌ర‌కు క‌రోనా త‌గ్గే అవ‌కాశం

హైద‌రాబాద్: జూన్ చివ‌రి వ‌ర‌కు క‌రోనా తీవ్ర‌త త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ‌లో 92 శాతం రిక‌వ‌రీ ఉంద‌న్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌శాంతంగా జ‌రుగుతుంద‌ని..క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి త‌గ్గుతున్నాయ‌న్నారు. క‌రోనాతో హాస్పిట‌ల్స్ లో చేరేవారి సంఖ్య కూడా త‌గ్గుతుంద‌న్న ఆయ‌న‌..వ‌చ్చే రెండు మూడు రోజుల్లో ల‌క్ష టెస్టులు చేస్తామ‌ని చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డికి సీఎం కేసీఆర్ రివ్యూలు, చర్యలు చేప‌ట్టార‌ని..స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా అధికారుల‌కు కేటీఆర్ ఆదేశాలు, మీటింగ్ లు నిర్వ‌హిస్తున్నార‌న్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో ఈ రోజు 3762 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా..క‌రోనాతో 20 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో  కోవిడ్ టెస్ట్ లు పెంచామని.. అవసరమైతే లక్షకు పైగా టెస్ట్ లు చేస్తామ‌న్నారు. అర్బన్ నుంచి రూరల్ కు కేసులు మారాయన్న ఆయ‌న‌..55,120 బెడ్స్ రాష్ట్రంలో ఉండ‌గా..33,321 బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. 23,745 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారని..40 శాతం ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారని తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు తగ్గాయని.. త‌ర్వాత‌ మన దగ్గర తగ్గాయని చెప్పారు. ఈ నెలాఖరు వరకు కేసులు ఇంకా తగ్గుతాయని.. జూన్ లో సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుతుందని తెలిపారు.

56 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని.. కోవిషీల్డ్ 61,8000 డోసులు ఉన్నాయన్నారు. 3.35 లక్షల డోసులు జూన్ లో వస్తాయన్నారు. 2. 5 లక్షల డోసులు కోవాగ్జిన్ ఉన్నాయని..  2.5 వ‌చ్చేవారం వస్తాయన్నారు. సూపర్ స్ప్రెడర్స్ హై రిస్క్ గ్రూప్ గా గుర్తించామని..28, 29, 30.. తేదీలలో వీరికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. 7 లక్షల 75 వేల మందిని మొదటి దశలో భాగంగా వ్యాక్సిన్ వేస్తామని..20 వేల మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వారికి వ్యాక్సిన్ వేస్తామ‌ని తెలిపారు.  3 లక్షల మంది ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్స్ కు వేస్తామని ..ప‌లు ప్రైవేట్ హాస్పిట‌ల్స్  వ్యాక్సిన్ అందిస్తున్నాయన్నారు. వ‌ర్క్ ప్లేస్ లోనే వ్యాక్సినేష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపిన హెల్త్ డైరెక్ట‌ర్ ..అంద‌రూ డోస్ వేసుకోవాల‌ని సూచించారు.