
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా.. 425 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా 113 మంది కరోనా బారిన పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో 72, కృష్ణా జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 1,486 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,950 మంది కొవిడ్ బారినపడగా, వారిలో 22,93,882 మంది కోలుకున్నారు. ఇంకా 7,358 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,710కి పెరిగింది.
మరిన్ని వార్తల కోసం..