జాతరలో రాజకీయాలు సరికాదు

జాతరలో రాజకీయాలు సరికాదు

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అతిపెద్ద ఆదివాసీ జాతరలో పాల్గొన్న ఆమె నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే తమిళిసై పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులెవరూ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారెవరూ లేకపోవడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికారు. ఉదయం వరకు మేడారం జాతర వద్దే ఉన్న మంత్రులు, అధికారులు గవర్నర్ రాగానే కనిపించకపోవడంపై సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. జాతరలో ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. గవర్నర్ వస్తున్న విషయం తెలిసినా కలెక్టర్, ఎస్పీలు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులతో రూపొందించిన మేడారం సావనీర్, అధికారిక కార్యక్రమాలకు తనను పిలవకున్నా జాతర సజావుగా భరించానని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మేడారం జాతరకు గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు భక్తుల దర్శనాన్ని నిలిపేసారు. ఈ విషయం తెలియడంతో తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాకతో ఇబ్బందులు పడ్డ వారికి క్షమాపణలు చెప్పారు. 

For more news..

గత ప్రభుత్వాల హయాంలో రౌడీ షీటర్లే పోలీస్ స్టేషన్లను నడిపేది

నితీష్ ను మర్యాదపూర్వకంగానే కలిశానన్న పీకే