8 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్.. తల్లికి మాత్రం నెగెటివ్.. అలా ఎలా?

8 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్.. తల్లికి మాత్రం నెగెటివ్.. అలా ఎలా?

కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద, పేద, ధనిక, ఆడ, మగా తేడా లేకుండా కరోనావైరస్ ఎవరికైనా సోకుతుంది. అందుకే ఈ వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు. అయినా సరే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా.. మహారాష్ట్రలో 8 రోజుల వయసున్న చిన్నారికి కూడా కరోనా సోకినట్లు సమాచారం. అయితే ఆ చిన్నారి యొక్క తల్లికి పరీక్షలు నిర్వహిస్తే ఆమెకు కరోనా నెగిటివ్ గా తేలింది. అలాంటప్పుడు శిశువుకు మాత్రం కరోనా ఎలా సోకిందని వైద్యులు ఆరా తీస్తున్నారు.

మహారాష్ట్ర.. పాల్ఘర్ జిల్లాలోని వాసై-విరార్ మున్సిపల్ పరిధిలో ఈ కేసు నమోదయింది. చిన్నారిని వీవీఎంసీ జుచంద్ర ఆస్పత్రిలో పరీక్షించినట్లు డాక్టర్ కిషోర్ గవాస్ తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా కొన్ని పరీక్షలు చేస్తామని.. అందులో భాగంగానే చేసిన పరీక్షల్లో చిన్నారికి కరోనా సోకినట్లు తేలిందని ఆయన తెలిపారు.

మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలోనే మహారాష్ట్ర కరోనా కేసులలో మొదటిస్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకు 3,648 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి 211 మంది చనిపోయారు.

For More News..

లాక్డౌన్ వల్ల ఒక్క ఊరులోనే 1600 పెళ్లిళ్లు వాయిదా

ఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ సడలించం