
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్ని వర్గాల వారికీ సోకుతోంది. సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను వదలడం లేదు. వీరితో పాటు ఆలయాల్లోని అర్చకులను కరోనా వైరస్ వదలడం లేదు. కొద్ది రోజుల క్రితం తిరుపతి, విజయవాడ, శ్రీశైలం ఆలయాల్లోని అర్చకులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు భద్రాద్రి రామయ్యకు నిత్య పూజలు, అభిషేకాలు చేసే అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఆలయ సిబ్బందిలో, భక్తుల్లో కలకలం రేగింది. ఇంతకు ముందే ఆలయంలోని ఓ ఉద్యోగికి కరోనా సోకింది. లేటెస్టు గా అర్చకుడికి కరోసా సోకడంతో వైరస్ బారిన పడినవారి సంఖ్య రెండుకు చేరింది. ఆలయంలో ఇలా ఒకరి తర్వాత ఒకరికి కరోనా సోకడంతో ఆలయ సిబ్బంది, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తమైన అధికారులు ఇతర ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. రామాలయ సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వచ్చారు.