
కరోనా వైరస్ ఢిల్లీలో స్వైరవిహారం చేస్తూనే ఉంది. లేటెస్టుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు కరోనా బారినపడ్డారు. దాంతో కార్యాలయాన్ని మూసివేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ సోకిన అధికారిని చికిత్సకు తరలించి, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్ విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఈసీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నితి ఆయోగ్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆఫీసును మూసివేసి శానిటైజ్ చేసిన ఆతర్వాత తిరిగి ఓపెన్ చేశారు.