
ఇటీవల హీరో రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు దర్శకుడు క్రిష్ కి కూడా కరోనా సోకింది. క్రిష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు. క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 4న తిరిగి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈ క్రమంలో సోమవారం నుంచి షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రిష్ పరీక్షలు చేయించుకున్నాడు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే క్రిష్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో షూటింగ్ వాయిదా పడింది.